Site icon Prime9

Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh:మధ్యప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రులుగా (స్వతంత్ర బాధ్యతలు) ఆరుగురు, రాష్ట్ర మంత్రులుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు.

గరిష్టంగా 35 మంది మంత్రులు..(Madhya Pradesh)

కేబినెట్ మంత్రుల పేర్లను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లారు. సీఎం మోహన్ యాదవ్ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలందరితో సమావేశమై మంత్రులందరి పేర్లు ఖరారు అయ్యాక ఆదివారం భోపాల్ చేరుకున్నారు.యాదవ్ నేతృత్వంలోని ఎంపీ క్యాబినెట్‌లో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా మరియు జగదీష్ దేవదా
ఉన్నారు. మోహన్ యాదవ్ డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు అదే రోజు ప్రమాణ స్వీకారం చేసారు. 230 మంది ఎమ్మెల్యేలు ఉన్న మధ్యప్రదేశ్ లో సీఎంతో సహా 35 మంది మంత్రి మండలిలో ఉండవచ్చు.

Exit mobile version