Site icon Prime9

AIIMS: 23 ఎయిమ్స్ కు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు

New Delhi: ప్రాంతీయ వీరులు, స్వాతంత్య్ర సమరయోధులు, చారిత్రక సంఘటనలు లేదా స్మారక చిహ్నాలు లేదా వారి ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ఆధారంగా ఢిల్లీతో సహా 23 ఎయిమ్స్‌లకు నిర్దిష్ట పేర్లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రిషికేశ్, నాగ్‌పూర్, రాయ్‌బరేలీ మరియు మధురైల ఎయిమ్స్ల పేర్లకు సంబంధించిన సూచఅు అందాయి. ఆరు కొత్త ఎయిమ్స్ బీహార్ (పాట్నా), ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్), మధ్యప్రదేశ్ (భోపాల్), ఒడిషా (భువనేశ్వర్), రాజస్థాన్ (జోధ్‌పూర్) మరియు ఉత్తరాఖండ్ (రిషికేశ్) ప్రధానమంత్రి స్వాస్దయోజన్ యొక్క ఫేజ్ 1లో ఆమోదించబడి పూర్తిగా పని చేస్తున్నాయి.

2015 మరియు 2022 మధ్య స్థాపించబడిన 16 ఎయిమ్స్‌లో 10 ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీబీఎస్ తరగతులు మరియు ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించబడ్డాయి. మరో రెండింటిలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే ప్రారంభించబడ్డాయి, మిగిలిన నాలుగు ఇన్‌స్టిట్యూట్లలో వివిధ దశల్లో అభివృద్దిపనులు జరుగుతున్నాయి.

Exit mobile version