Site icon Prime9

New Corona variant: మూడు రాష్ట్రాల్లో 21 కరోనా కొత్త వేరియంట్ JN.1 కేసులు

New Corona variant

New Corona variant

 New Corona variant: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 యొక్క 21 కేసులు నమోదయ్యాయి. గోవా, కేరళ మరియు మహారాష్ట్రలో కొత్త కరోనావైరస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.గోవాలో ఇప్పటివరకు 19 కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. కేరళ మరియు మహారాష్ట్రలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

అత్యంత వేగంగా వ్యాప్తి..( New Corona variant)

ఒమిక్రాన్ జాతికి చెందిన JN.1 గత కొన్ని వారాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌లలో ఒకటిగా మారింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1ని ప్రత్యేక వేరియంట్ గా వర్గీకరించింది. అయితే ఇది తక్కువ” ప్రమాదాన్ని కలిగిస్తుందని పేర్కొంది.దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు కోవిడ్ సంసిద్ధతను పెంచుకోవడం, పరీక్షలను వేగవంతం చేయడం మరియు వారి నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం చేయాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. మరోవైపు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. జిల్లాల వారీగా ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం మరియు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల కేసులను అన్ని ఆరోగ్య కేంద్రాలలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నివేదించాలని సలహా రాష్ట్రాలను ఆదేశించింది.

Exit mobile version