Site icon Prime9

Nuclear Power Plants : 2031 నాటికి దేశంలో 20 కొత్త అణు విద్యుత్ ప్లాంట్లు.. కేంద్రమంత్రి జితేంద్రసింగ్

Nuclear power plants

Nuclear power plants

Nuclear Power Plants : 2031 నాటికి దాదాపు 15,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 20 కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించాలని భారత్ యోచిస్తోందని ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలిపింది.ఈ 20 అణు విద్యుత్ ప్లాంట్లలో మొదటిది, 700 మెగావాట్ల యూనిట్, గుజరాత్‌లోని కక్రాపర్‌లో 2023లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే మూడు అణు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు పనిచేస్తోంది.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్రాతపూర్వక సమాధానం ప్రకారం, కల్పాక్కంలో 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2024లో, ఆ తర్వాత 2025లో కుడంకుళంలో రెండు 1,000 మెగావాట్ల యూనిట్లు పని చేసే అవకాశం ఉంది.రాజస్థాన్‌లోని రావత్‌భటా వద్ద రెండు 700 మెగావాట్ల యూనిట్లు 2026 నాటికి, మరో రెండు 1,000 మెగావాట్ల యూనిట్లు 2027 నాటికి కుడంకులంలో పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.హర్యానాలోని గోరఖ్‌పూర్‌లో 2029 నాటికి రెండు 700 మెగావాట్ల యూనిట్లు పూర్తవుతాయని, పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను మంత్రి తెలిపారు.

అదనంగా, గోరఖ్‌పూర్, హర్యానా (యూనిట్‌లు 3,4), కైగా, కర్ణాటక (యూనిట్‌లు 5,6), చుట్కా, మధ్యప్రదేశ్ (యూనిట్‌లు 1,2)లో 700 మెగావాట్ల 10 అణు విద్యుత్ యూనిట్లు నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ 10 అణు విద్యుత్ యూనిట్లు 2031 నాటికి క్రమంగా పూర్తయ్యే అవకాశం ఉందని సింగ్ చెప్పారు.2017-18 మరియు 2021-22 మధ్య జాతీయ గ్రిడ్‌కు కుందన్‌కుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ (యూనిట్ 1,2) 48,382 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందించిందని వేరే ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో సింగ్ చెప్పారు.

Exit mobile version