Modi’s Cabinet:కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం నాడు తొలి కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. మంత్రులకు పోర్టుపోలియోలు కూడా కేటాయించారు. అయితే మోదీ 3.0లో దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల నుంచి 13 మందికి మంత్రి పదవులు దక్కాయి. వాటిలో కీలకమైన ఆర్థిక శాఖ,విదేశీ వ్యవహరాలు, పౌర విమానయాన శాఖ దక్షిణాది వారికి లభించాయి. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ పట్టుతప్పుతోందని తెలుసుకున్న మోదీ వెంటనే తన ఫోకస్‌ను దక్షిణాది వైపు పెట్టారు. మొత్త్తానికి చూస్తే దక్షిణాది రాష్ర్టాలు కలిసి మొత్తం 29 సీట్లు బీజేపీకి ఖాతాకు ఇచ్చినట్లు అయ్యింది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తూ వస్తోంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ దక్షిణాదికి చెందిన ఐదు రాష్ర్టాల నుంచి 29 సీట్లు సంపాదించుకుంది.దీంతో ప్రధాని కూడా దక్షిణాది నుంచి 13 మందికి మంత్రి పదవులు ఆఫర్ చేశారు. ఇక దక్షిణాది రాష్ర్టాల విషయానికి వస్తే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఎంపికైన వారికి కేబినెట్‌లో నాలుగు కీలక పోస్ట్‌లు అప్పగించారు. వాటిలో ఫైనాన్స్, ఫారిన్ అపెర్స్, ఏవియేషన్, హెవీ ఇండస్ర్టీస్ పోస్ట్‌లు కట్టబెట్టారు.
దక్షిణాన 29 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. (Modi’s Cabinet)
ఇక ఎన్‌డీఏ ఉత్తరాది రాష్ర్టాల్లో మొత్తం 54 స్థానాలు కోల్పోయింది. అయితే దక్షిణాది రాష్ర్టాల్లో మొత్తం 129 లోకసభ స్థానాలకు గాను బీజేపీ 29 సీట్లు దక్కించుకుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్‌డీఏ దక్షిణాది రాష్ర్టాల్లో30 సీట్లు మాత్రమే గెలుచుకుంది.అయితే 2019లో జరిగిన ఎన్నికలప్పుడు జెడీఎస్, టీడీపీలు ఎన్‌డీఏలో భాగస్వాములు కావు. కేరళలోని త్రిసూర్ నుంచి సురేష్ గోపి గెలిచి చరిత్ర సృష్టించారు. ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. మరో పక్క తమిళనాడు విషయానికి వస్తే కాషాయపార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే అన్నామలై మాత్రం పార్టీ కోసం రాత్రనక పగలకన కష్టపడ్డారు. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీ బలమైన పార్టీ. బీజేపీ (జెడీఎస్)తో చేతులు కలిపి 18 సీట్లు దక్కించుకుంది. అయితే 2019లో సాధించిన రికార్డను తిరగరాయలేకపోయింది. 3.0లోకర్ణాటక నుంచి జనతాదళ్ సెక్యూలర్ నుంచి హెచ్‌డీ కుమారస్వామికి మంత్రి పదవి దక్కగా.. బీజేపీ నుంచి ప్రహ్లాద్ జోషికి కన్స్యూమర్ ఎఫైర్స్, రెన్యూవబుల్ ఎనర్జీమంత్రి పదవి దక్కగా.. వి సోమన్న, శోభా కరండ్‌లాజేలకు మంత్రి పదవులు దక్కాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలుకలిసి పోటీ చేశాయి. మొత్తం 25 లోకసభ స్థానాలకు గాను తెలుగుదేశం 16 సీట్లు, బీజేపీ మూడు, జనసేన్ రెండు సీట్లు సాధించింది. టీడీపీ తరపున కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ మంత్రి పదవి లభించింది. ఆయనతో పాటు పిన్నమనేని చంద్రశేఖర్, బీజేపీకి నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు సహాయమంత్రి పదవులు ఇచ్చారు. ఇక తెలంగాణలో 17 లోకసభ సీట్లకు గాను ఎనిమిది సీట్లుదక్కించుకుంది. జి కిషన్‌రెడ్డికి కోల్ అండ్ మైన్స్ మంత్రిగా బాధ్యతలు అప్పగించగా.. బండి సంజయ్‌కి హోం వ్యవహారాల సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే బీజేపీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. బీజేపీ రాష్ర్ట ప్రెసిడెంట్ అన్నామలైకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. అయితే రాష్ర్టం నుంచి ఒక్క సీటు కూడా గెలిపిచనందుకు తాను బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగానే కొనసాగుతానని చెప్పారు. కాగా తమిళనాడు నుంచి కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆర్థికశాఖమంత్రిగా నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహరాలమంత్రి జై శంకర్, ఎల్ మురుగన్‌కు సమాచారశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు.