Heatstroke: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆవార్డుల ప్రదానోత్సవం 11 మంది ప్రాణాలు తీసింది. వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎండ వేడిమికి తాళలేక.. 11 మంది మృతి చెందారు. వందకు పైగా అస్వస్థతకు గురయ్యారు.
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆవార్డుల ప్రదానోత్సవం 11 మంది ప్రాణాలు తీసింది. వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎండ వేడిమికి తాళలేక.. 11 మంది మృతి చెందారు. వందకు పైగా అస్వస్థతకు గురయ్యారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు హాజరయ్యారు. మహారాష్ట్ర భూషణ్ అవార్డు పొందిన సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్ ను సత్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుక మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే.. దేవేంద్ర ఫండ్నవీస్, కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే కేవలం వీఐపీలు కూర్చునేందుకు మాత్రమే టెంట్లను ఏర్పాటు చేశారు. మిగిలిన మైదానంలో ఎక్కడా టెంట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఎండలోనే ఉండి వీక్షించారు. దీంతో ఎండ తీవ్రత కారణంగా చాలామంది వడదెబ్బకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మంది మహిళలతో సహా 11 మంది మరణించారు. వంద మందికిపైగా వడదెబ్బ కారణంగా అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏన్ నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అస్వస్థతకు గురైనవారని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
వడదెబ్బకు గురై ఎంజీఎం కమోతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఉద్దవ్ ఠాక్రే, అతని కుమారుడు ఆధిత్య థాకరే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ లు పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాం.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అవార్డు వేడుకల ప్రాంగణంలో సరియైన ఏర్పాటు చేయకపోవటం వల్లనే ఈ ప్రమాదం తలెత్తింది. ఈ సంఘటనను ఎవరు విచారిస్తారు? అంటూ ప్రశ్నించారు.