Site icon Prime9

Married women Flee with Lovers: పీఎంఏవై డబ్బులు చేతిలో పడగానే లవర్స్ తో జంప్ అయిన 11 మంది వివాహిత మహిళలు

Married women

Married women

Married women Flee with Lovers:ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.  ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇంటిని నిర్మించడంలో ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఈ పథకంలో మొదటి విడత రూ.40,000 అందిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి తన భార్య సునియా కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.40,000 వాయిదా డబ్బును తీసుకుని సునియా గుర్తు తెలియని వ్యక్తితో పారిపోయిందని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ఇలాంటి మరో 10 కేసులు వెలుగులోకి వచ్చాయి, అక్కడ భర్తలు తమ భార్యలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసారు. ఇటీవల మహారాజ్‌గంజ్ జిల్లాలో పీఎంఏవై పథకం కింద దాదాపు 2,350 మంది లబ్ధిదారులు వాయిదాలు అందుకున్నారు.

నా కొడుకు ఖాతాలో జమ చేయండి..(Married women Flee with Lovers)

మిగిలిన రెండు వాయిదాలను తన కుమారుడు సంజయ్ ఖాతాకు బదిలీ చేయాలని సునియా మామగారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.మా కోడలు ఖాతాకు డబ్బు జమ అయింది. ఆమె ఒక అబ్బాయితో పారిపోయిందని మాకు తరువాత తెలిసింది. నా కొడుకు ఖాతాకు డబ్బు జమ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దీనిపై మహారాజ్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అనునయ్ ఝా మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడతను ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించకుండా 11 మంది మహిళలు దుర్వినియోగం చేసినట్లు దృష్టికి వచ్చింది. లబ్ధిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు నిధులను రికవరీ చేయాలని సంబంధిత శాఖను ఆదేశించారు.అయితే, ఇలాంటి ఘటన ఇది మొదటిది కాదు. గతంలో, బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు పథకంలో భాగంగా రూ.50,000 తీసుకుని తమ ప్రేమికులతో పారిపోయారు.

Exit mobile version