Punjab Gas Leak: పంజాబ్‌లోని లూథియానాలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మృతి చెందగా, 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన గియాస్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది.మృతుల్లో ఆరుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు.క్షగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీకి కారణమేమిటో తెలియరాలేదు.రెస్క్యూ ఆపరేషన్ కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్) బృందం సంఘటనా స్థలంలో ఉంది.
ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు..(Punjab Gas Leak)
గ్యాస్ లీక్ సంఘటనలను నిర్వహించడంలో నిపుణులైన 35 మంది సభ్యులతో కూడిన కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్ (CBRN) బృందాన్ని ఎన్డీఆర్ఎఫ్ నియమించింది.ప్రాంతాన్ని వేరుచేయడం జరిగింది మరియు గ్యాస్ మూలాన్ని గుర్తిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ ఇనస్పెక్టర్ జనరల్ (IG) నరేంద్ర బుందేలా తెలిపారు.పోలీసులు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు.వైద్యులు మరియు అంబులెన్స్‌ల బృందాన్ని కూడా పిలిచినట్లు పోలీసులు తెలిపారు.
ట్విటర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనను విచారకరమైనదని అభివర్ణించారు.సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.లూథియానాలోని గియాస్‌పురా ప్రాంతంలోని ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటన చాలా బాధాకరం. పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ మరియు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయని మాన్ పంజాబీలో ట్వీట్ చేశారు.