Rajasthan: రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
గుజరాత్ నుంచి యూపీకి వెడుతున్న బస్సు..(Rajasthan)
బస్సు 60 మంది ప్రయాణికులతో గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మధురకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లఖన్‌పూర్ ప్రాంతంలోని అంట్రా ఫ్లైఓవర్ వద్ద బస్సు ఆగిపోవడంతో వెనుక నుంచి ట్రైలర్ ఢీకొట్టింది. ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఆర్‌బీఎం ఆస్పత్రికి తరలించారు.ప్రధాని నరేంద్రమోదీ ప్రమాదం పట్ల తన సంతాపాన్ని తెలియజేసారు. మృతుల బంధువులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
భరత్‌పూర్ రోడ్డు ప్రమాదం పై జస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. గుజరాత్ నుండి వచ్చిన బస్సు మరియు భరత్‌పూర్‌లో ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 11 మంది మరణించడం చాలా బాధాకరం. పోలీసు యంత్రాంగం సంఘటన స్థలంలో ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.మృతులందరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని X లో పోస్ట్ చేసారుజ