Raigad Landslide మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో రాయ్‌గఢ్ జిల్లాఇర్సల్‌వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి పది మంది మరణించారు. ఈ శిధిలాల కింద 50 మంది దాకా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
కొంతమందిని రక్షించామని, అయితే ఇంకా చాలా మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు దాదా భూసే, ఉదయ్ సమంత్ ఘటనా స్థలంలో ఉండగా, ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తోంది.భారీ వర్షాల కారణంగా , రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతంగా కొనసాగించడం కష్టమవుతోంది. గురువారం అర్దరాత్రి 12 గంటలకు జరిగిన ఈ సంఘటనతో స్దానికులు ఆందోళనకు గురయ్యారు. ఇర్సాల్వాడిలో దాదాపు 46-50 ఇళ్ళు ఉన్నాయి, వీటిలో 25 కుటుంబాలను తరలించారు. పెద్ద సంఖ్యలో పశువులు కూడా శిథిలాల కింద చిక్కుకున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్ నాధ్ షిండే సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.