Uganda: 12 పెళ్లిళ్లు, 102 మంది పిల్లలు, 568 మంది మనవళ్లు ఉన్న ఉగాండ రైతు.. చివరకి ఏం నిర్ణయం తీసుకున్నాడంటే?

12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.

  • Written By:
  • Updated On - December 27, 2022 / 05:03 PM IST

Uganda: 12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు. 67 ఏళ్ల మూసా హసహ్య ఇప్పుడు తన భార్యలను గర్భనిరోధకమాత్రలు ఉపయోగించమని కోరాడు.

musa hasahya

హసహ్యా మరియు అతని కుటుంబం ఉగాండాలోని లుసాకాలో నివసిస్తున్నారు. ఇక్కడ బహుభార్యత్వం చట్టబద్ధమైనది. 16 ఏండ్ల వయస్సులో తొలిసారిగా పెళ్లి చేసుకున్న హసహ్యా కొత్తదనం కోసం మరో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. భార్యలు పెరిగారు. ఫలితంగా సంతానం కూడా పెరిగింది. మొత్తం 102 మంది పిల్లలు పుట్టారు. ఇలా ఉండగా అతను తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. ఇక తాను పిల్లల్ని కనబోనని ప్రకటించాడు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నా ఆదాయం సంవత్సరాలుగా తగ్గిపోయింది. నా కుటుంబం పెద్దదిగా మారింది.కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదని అందుకే పిల్లలను కనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని తన భార్యలకు చెప్పానని అన్నాడు.

musa-hasahya

అతని చిన్న భార్య, 11 మంది పిల్లల తల్లి జులైకా ఇలా చెప్పింది. నాకు ఇక పిల్లలు వద్దు. నేను ఆర్థిక పరిస్థితిని చూసి ఇప్పుడు గర్భనిరోధక మాత్రలు వేసుకుంటున్నానని తెలిపింది. అతని పెద్ద బిడ్డ అతని చిన్న భార్య కంటే 21 సంవత్సరాలు పెద్దది. అతని పిల్లలలో దాదాపు మూడింట ఒకవంతు, ఆరు మరియు 51 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అతని పొలంలో నివసిస్తున్నారు హసహ్యకు 12 బెడ్‭రూంలు ఉన్న ఇల్లు ఉంది.