Site icon Prime9

Budget Halwa: బడ్జెట్ హల్వా అంటే ఏంటి.. తీపి తిని ఎందుకు అధికారులు క్వారెంటైన్ కి వెళ్తారు..?

budget halwa

budget halwa

Budget Halwa: ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ బడ్జెట్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

ఇంతటి ప్రాముఖ్యత ఉన్న యూనియన్ బడ్జెట్ రూపకల్పనలో అనేక ముఖ్యఅంశాలు దాగి ఉంటాయి.

అందులో ఓ ఇంపార్టెంట్ ఈవెంట్ బడ్జెట్‌ హల్వా. దీన్ని బడ్జెట్ తయారీలో సెండాఫ్ ఈవెంట్ గా భావిస్తారు.

బడ్జెట్‌ తయారీలో పని చేసే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది కోసం హల్వా సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

కరోనా వల్ల కొంత కాలం ఆగిపోయిన బడ్జెట్‌ హల్వా కార్యక్రమం మళ్లీ ఈ ఏడాది ప్రారంభమయ్యింది.

గత ఏడాది మిఠాయి పంపిణీతో సరిపెట్టగా.. ఈ సంవత్సరం యథావిధిగా హల్వా సెరమనీ నిర్వహించారు.

ఈ ఈవెంట్ ఆర్థిక మంత్రి సమక్షంలో జరుగుతుంది. నిర్మలా సీతారామన్‌ కడాయిలో వండిన హల్వా సీల్‌ను తెరిచి.. అందరికీ పంచి ఈ ఆనవాయితీని కొనసాగించారు.

క్వారెంటైన్ లోనే బడ్జెట్ అంతా..

ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో ఈ వేడుకను వైభవంగా నిర్వహించడం దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది.

సాధారణంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి వారం, పదిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

అనుకోకుండా ఈసారి గణతంత్ర దినోత్సవం నాడే ఈ హల్వా(Budget Halwa) కార్యక్రమం జరగడం గమనార్హం.

బడ్జెట్‌ తయారీ అంతా ఫైనల్‌ బడ్జెట్‌ డాక్యుమెంట్‌ బయటకు వచ్చేదాకా అంతా గోప్యంగానే ఉంటుంది.

బడ్జెట్‌ రూపొందించే అధికారులు, సిబ్బంది అంతా వందమంది దాకా ‘లాక్‌ ఇన్‌ పీరియడ్‌’లో ఉండిపోతారు.

కుటుంబ సభ్యులతో సహా బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాతే వాళ్లు బయటకు వచ్చేది.

budget halwa1

ఒక రకంగా చూసుకుంటే.. ఇది క్వారంటైన్‌ లాంటిదే. ఈ సమయంలో వారికి మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండదు.

ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా నిషేధం. ఒక్క ల్యాండ్ లైన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

దాన్ని కూడా అత్యవసర సమయంలోనే ఉపయోగించేలా అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బడ్జెట్ కి సంబంధించిన ఏ చిన్న అంశం కూడా లీక్ కాకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తారు.

ఈ బడ్జెట్ రూపకల్పనలో పాల్గొనే అధికారుల ఇళ్లు, కుటుంబ సభ్యులపై పూర్తి నిఘా ఉంటుంది.

బడ్జెట్ పత్రాలున్న కంప్యూటర్లు ఇంటర్నెట్, ఎన్ఐసీ సర్వర్ల నుంచి వేరుచేస్తారు.

కంప్యూటర్లు ప్రింటర్లు, ప్రింటింగ్ మెషీన్లకు మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంటాయి.

ముద్రనా విభాగంలోని వ్యక్తులను అత్యవసరం అయితే తప్ప బయటకు పంపరు.

ఒకవేళ బయటకు పంపాల్సి వస్తే.. ఒక ఇంటలిజెన్స్ అధికారితో పాటు ఒక పోలీస్ అధికారి వారివెంటే ఉండి నీడలా కాపుకాస్తూ ఉంటారు.

బడ్జెట్ కు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అయిన అప్పుటికప్పుడే లక్షల కోట్ల రూపాయల గ్యాంబ్లిక్ నడుస్తుంది.

స్టాక్ మార్కెట్లలో అమాంతంగా మార్పులు కనిపిస్తాయి. ఇందంతా ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్న చూపుతుంది.

అందుకే ఇంత కట్టుదిట్టమై భద్రత నడుమ బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది.

బడ్జెట్ లీక్..

గతంలో 1950లో బడ్జెట్ పత్రాలు లీక్ అయిన సంఘటన చోటుచేసుకుంది.

దానితో బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ని రాష్ట్రపతి భవన్ నుంచి మింట్ రోడ్లోని సెక్యురిటీ ప్రెస్ కు మార్చారు.

తర్వాత 1980 నుంచి నార్త్ బ్లాక్ లో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ అండర్ గ్రౌండ్లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు.

1980 నుండి 2020 వరకు అక్కడే బడ్జెట్ పత్రాలను ముద్రించేవారు. ఆ తర్వాత, బడ్జెట్ డిజిటల్‌గా మారింది.

ఈ బడ్జెట్ పేపర్లు హిందీ ఇంగ్లీష్ భాషలలో మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

గతంలో లాక్‌ఇన్‌ పీరియడ్‌ రెండు వారాలు ఉండేది. తర్వాత పదిరోజులు అయ్యింది.

ఇప్పుడు బడ్జెట్‌ అనేది డిజిటల్‌ ఫార్మట్‌కు మారడంతో.. ఐదు రోజులకు కుదించారు.

ఫిబ్రవరి 1వ తేదీన వరుసగా ఐదవసారి సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

గత రెండు బడ్జెట్‌లా మాదిరే ఈ ఏడాది కూడా పేపర్‌లెస్‌గా బడ్జెట్‌ ఉండనుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version