West Bengal teachers recruitment scam:పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. ఉపాధ్యాయ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయిన టీఎంసీ యువనేత కుంతల్ ఘోష్ నుండి అందుకున్న డబ్బును నటులు బోనీ సేన్‌గుప్తా మరియు సోమ చక్రవర్తి తిరిగి ఇచ్చారు.
నటుడు బోనీ సేన్‌గుప్తా రూ.44 లక్షలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందజేయగా, సోమ చక్రవర్తి ఈడీకి రూ.55 లక్షలు అందజేశారు. దీనితో ఈడీకి దాదాపు కోటి రూపాయలు తిరిగి వచ్చాయి.మరోవైపు కుంతల్ ఘోష్‌కు చెందిన 10 బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది.బోనీ సేన్‌గుప్తా స్నేహితురాలు నటి కౌషానీ ముఖోపాధ్యాయ తన సన్నిహితులలో ఒకరితో కుంతల్ ఘోష్ కు పరిచయం ఏర్పడింది. నటి కుంతల్ ఘోష్‌కి సన్నిహితురాలయిన సోమ చక్రవర్తి పార్లర్‌లో మోడల్‌గా పనిచేసింది.
రిక్రూట్‌మెంట్ అవినీతి కేసులో హుగ్లీలోని బాలాగఢ్‌కు చెందిన యువ తృణమూల్ నాయకుడు, కుంతల్ ఘోష్, శంతను బెనర్జీలను అరెస్టు చేసిన తర్వాత నటుడు బోనీ సేన్‌గుప్తా పేరు తెరపైకి వచ్చింది. బోనీ సేన్‌గుప్తాను ఈడీ రెండుసార్లు ప్రశ్నించింది.ఈడీ అధికారుల విచారణ తర్వాత, కుంతల్ ఘోష్ బోనీ సేన్‌గుప్తాకు కారు కొనడానికి రూ. 40 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ డబ్బు రిక్రూట్‌మెంట్ స్కామ్ నుండి వచ్చింది.దీని తర్వాత, బోనీ సేన్‌గుప్తాను రెండు సార్లు ప్రశ్నించారు. సేన్‌గుప్తా విదేశీ ప్రయాణాలు కూడా స్కానర్ కిందకు వచ్చాయి. ఆ తర్వాత కుంతల్ ఇచ్చిన రూ.40 లక్షలతో కారు కొన్నట్లు సేన్‌గుప్తా ఈడీకి తెలిపాడు.2017లో కుంతల్ ఇచ్చిన డబ్బును తాను నేరుగా తీసుకోలేదని బోనీ సేన్‌గుప్తా పేర్కొన్నాడు. దీని తర్వాత, డబ్బును కార్ షోరూమ్‌కు పంపారు.
తాను కారు కొనుక్కోవడానికి డబ్బు తీసుకున్నానని, అయితే ఆ తర్వాత కుంతల్ ఘోష్ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, దానికి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా యువనేతకి అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చాడని పేర్కొన్నాడు.విచారణ సమయంలో బోనీ సేన్‌గుప్తా తీవ్రంగా ఏడ్చినట్లు సమాచారం.