Tuni Train Burning case: తుని రైలు దహనం కేసుని విజయవాడ రైల్వేకోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, నటుడు జివి సహా 41మంది నిందితులని కేసునుంచి విముక్తులని చేస్తూ తీర్పు ఇచ్చింది. 24మంది సాక్ష్యుల్లో 20మంది సాక్ష్యం చెప్పారు. ఐదుగురు తెలియదని చెప్పారు. దీనితో నిందితులకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవంటూ రైల్వే కోర్టు కేసుని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై కాపు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు,. ఈ కేసులో రైల్వే ఉన్నతాధికారులు ముగ్గురూ సరైన విచారణ చేయలేదని రైల్వే కోర్టు తేల్చింది. ఈ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
2016 రైలు దగ్ధం కేసులో ముద్రగడ పద్మనాభం (ఏ1), ఆకుల రామకృష్ణ (ఏ2), దాడి శెట్టి రాజా (ఏ3) సహా 41 మందిపై ఆర్పీఎఫ్ దర్యాప్తు అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. 24 మంది సాక్షులలో 20 మందిని మాత్రమే ఆర్‌పిఎఫ్ అధికారులు విచారించారు. కోర్టు విచారణ సందర్భంగా నిందితులు హాజరయ్యారు.
కాపులకు రిజర్వేషన్లు కావాలని..( Tuni Train Burning case)
జనవరి 31, 2016న తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన పేరుతో జరిగిన బహిరంగ సభకు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాపులను వెనుకబడిన తరగతుల కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌పై అప్పటి మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అనంతరం నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు . తుని రైల్వేస్టేషన్‌కు వెళ్లి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. గుంపును చూసిన ప్రయాణికులు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. రైలు దగ్ధం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ కేసులో పోలీసులు పద్మనాభంతో పాటు పలువురు కాపు ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి 69 కేసులు నమోదు చేయగా వైసీపీ సర్కార్ వాటిని ఉపసంహరించుకుంది.
https://youtu.be/LmDWIJp8824