National News: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న ఐదుగురున్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు ముగ్గురు కాగా, ఏపీకి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మొత్తం ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనికి రాష్గ్రపతి ఆమోదముద్ర వేసారు.
జస్టిస్‌లు బట్టు దేవానంద్, డి రమేష్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మద్రాస్, అలహాబాద్ హైకోర్టులకు బదిలీ చేయాలని సిఫారసు చేశారు. తెలంగాణలో హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్ నాగార్జున్ ను మద్రాస్ హైకోర్టుకు పంపుతూ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు .. జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డి బదిలీని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.