Site icon Prime9

BRS Formation Day: నేడు బీఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవం… తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం

BRS formation Day

BRS formation Day

BRS Formation Day: నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరగనుంది. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దేశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో పలు తీర్మానాలపై చర్చ జరగనుంది.

దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత..(BRS Formation Day)

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్. 22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ పోస్టు చేశారు.

దేశంలోనే అగ్రస్దానంలో తెలంగాణ..

బీఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమైన ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్రం సాధించిందని గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు.. భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు.. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై భారత్ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Exit mobile version