Site icon Prime9

Revanth Reddy comments: నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy comments:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్‌ విచారణకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్‌ కార్యాలయానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రేవంత్‌కు నోటీసులు ఇవ్వడంపై ఆందోళనకు దిగారు. ఈ నేపధ్యంలో సిట్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ విజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

కేటీఆర్ ను విచారించాలి..(Revanth Reddy comments)

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీక్ కు సంబంధించి తనకు, బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసిన సిట్ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఎందుకు జారీ లేదని ప్రశ్నించారు. కేటీఆర్ ను కూడా విచారిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. తమ వద్ద ఉన్న సమాచారం చెబితే తమకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల భవిష్యత్తును ఆలోచించే తాను ఈ విచారణకు హాజరయ్యాయని ఆయన అన్నారు.

ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు..

విచారణకి హాజరైన రేవంత్ రెడ్డి తన ఆరోపణలకి సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని సిట్ అధికారులు అంటున్నారు. ఒకే మండలంలో వందమంది పాస్ అయినట్లుగా ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఆ దిశగా సాక్ష్యాలివ్వలేకపోయారని సిట్ అధికారులు చెబుతున్నారు. నిరాధారమైన ఆరోపణలుగా భావించిన సిట్ అధికారులు రేవంత్ రెడ్డిపై చర్యలకి సిద్ధమవుతున్నారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని రేవంత్‌పై చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు వెల్లడించారు.

మరో ముగ్గురు నిందితుల అరెస్ట్ ..

టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరో ముగ్గురు నిందితులని అరెస్ట్ చేసింది. ఉద్యోగిని షమీమ్‌తోపాటు మరో ఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకుంది. టిఎస్‌పిఎస్‌సి మెంబర్ దగ్గర పని చేస్తున్న రమేష్ చేశారు. టిఎస్‌పిఎస్‌లోనే పని చేస్తున్న సురేష్‌ని బుధవారంనాడు సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏవన్‌ ప్రవీణ్‌కి సన్నిహితంగా మెలిగిన సురేష్ గ్రూప్ వన్ పేపర్‌ని కొట్టేశాడు. గ్రూప్ వన్ పేపర్ లీకేజిలో సురేష్, రఫీ కీలకంగా వ్యవహరించారు. తాజాగా చేసిన మూడు అరెస్టులతో నిందితుల సంఖ్య 12కి చేరింది.

Exit mobile version