Site icon Prime9

Telangana Assembly: కాళోజీ కవితతో గవర్నర్ ప్రసంగం.. రాష్ట్రాన్ని పొగడ్తలతో ముంచేత్తిన తమిళి సై

When will Assembly Bills be passed from the Governor...KCR is acting arrogantly

When will Assembly Bills be passed from the Governor...KCR is acting arrogantly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు 2023-24 నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేశారు. ప్రముఖ కవి కాళోజీ వాక్కులతో.. పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది అంటూ తన ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.

తెలంగాణ గవర్నర్ త‌మిళిసై ప్ర‌సంగంతో బడ్జెట్ సెషన్ నేడు ప్రారంభమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టేలా ఉంది. పుట్టుక నీది.. చావు నీది.. బ‌తుకంతా దేశానిది అంటూ.. కాళోజీ మాట‌ల‌ను గుర్తు చేస్తూ త‌న‌ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తు.. సీఎం కేసీఆర్ స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న వల్ల రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తమిళి సై అన్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల కృషి.. ఉద్యోగుల‌ నిబ‌ద్ధ‌త వల్ల దేశంలో రాష్ట్రంలో నంబర్ వన్ దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వెల్లువ..

తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత అభివృద్ధి.. దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. గత పాలనలో.. కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. నేడు వెలుగులు విరాజిల్లుతూ 24 గంటల విద్యుత్‌ అందిస్తుందని వివరించారు. తెలంగాణలో వ్యవసాయం కుదేలైన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యగారంగా అవతరించిందని వెల్లడించారు.

తాగునీటి కోసం తల్లడిల్లిన తెలంగాణ.. ప్రభుత్వ కృషితో వంద శాతం గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీరు అందిస్తుందని తెలిపారు. పాడుబడిన తెలంగాణ నుంచి.. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణను చూస్తున్నామని గవర్నర్ అన్నారు. గ్రామీణ రూపురేఖలు మారి.. ఉన్నత జీవన ప్రమాణాలతో.. దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ.. పచ్చదనం పెంపులో రాష్ట్రం ముందుగా నిలిచిందన్నారు.

విద్యారంగంలో పెనుమార్పులు..

2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు.

రాష్ట్రం ఏర్పడేనాటికి.. రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. నేడు రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక కంపెనీలు ఉద్యోగులకు తొలగిస్తుంటే.. తెలంగాణలో కొలువుల జాతర సాగిందని గవర్నర్ అన్నారు.

2014 నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశామని.. ప్రస్తుతం మరో 80,039 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.

రాష్ట్రం సిద్ధించాక ఇప్పటి వరకు.. చెప్పారు. మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. దేశ చరిత్రలో ఇది అపూర్వ ఘట్టమని గవర్నర్ అన్నారు.

విద్యారంగంలో వికాసం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. పేద విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

గవర్నర్ ప్రసంగంలోకి కీలక అంశాలు..

హరితహారం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచామని.. పరిశ్రమలు ఐటీ ద్వారా 3.31 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు.
హైదరాబాద్‌ చుట్టూ 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు.. 20 జిల్లాల్లో డయాగ్నెస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని.. తెలంగాణలో 17 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తెలిపారు.
ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం.. 203 మైనారిటీ గురుకల పాఠశాలలు ఏర్పాటుకు కృషి చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు.
ఇప్పటివరకూ 12.5 లక్షల మందికి షాదీ ముబారక్‌.. 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి పథకం అందిందని తెలిపారు.
మన ఊరు-మన బడి ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు.

న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి.
జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి.
బతుకమ్మ ఫెస్టివల్‌ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి.
నేతన్నలకు రూ. 5లక్షల బీమా పథకం.
మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉందన్నారు.

గవర్నర్‌ ప్రసంగం తర్వాత సభను వాయిదా వేశారు. ఈ సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది.

స్వయంగా సీఎం కేసీఆర్ గవర్నర్ ను దగ్గరుండి.. హాల్ లోకి స్వాగతం పలికారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version