UttarPradesh: ఢిల్లీలో రూ. 11 లక్షల విలువైన టూత్‌పేస్ట్‌ను దొంగిలించిన దొంగను ఉత్తరప్రదేశ్‌లోని అతని ఇంట్లో అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కున్వర్ పాల్ సింగ్ నవంబర్ 22న తన గోదాములో 215 టూత్ పేస్టుల బాక్సులను దొంగిలించారని పోలీసులకు సమాచారం అందించాడు.
చోరీకి సంబంధించి లాహోరీ గేట్ పోలీసులకు సింగ్ ఫిర్యాదు చేశాడు. తన గోదాములో ఒక మొబైల్ ఫోన్‌తో పాటు క్లోజప్, డాబర్-రెడ్ కంపెనీలకు చెందిన 215 బాక్సుల టూత్‌పేస్ట్ ట్యూబ్‌లు చోరీకి గురయ్యాయని తెలిపారు.తన గోదాము ఉద్యోగి ఉదయ్ కుమార్ అలియాస్ సంతోష్ ఈ చోరీకి పాల్పడి ఉంటాడని అనుమానించాడు.
దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు దాదాపు 40 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లోని జర్వాల్ రోడ్ పోలీస్ స్టేషన్ సహాయంతో 23 ఏళ్ల నిందితుడిని గుర్తించారు. నవంబర్ 25న పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు.విచారణలో, కున్వర్ పాల్ సింగ్ గోడౌన్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత వస్తువులను దొంగిలించడానికి ప్లాన్ వేసినట్లు సంతోష్ అంగీకరించాడు. సమీపంలోని చిన్న టీ స్టాల్ యజమాని గుడ్డుకు సింగ్ గోదాము తాళాలు ఇచ్చి వెడతాడని అతనికి తెలుసు.నవంబర్ 20న, సింగ్ లేకపోవడంతో, సంతోష్ డెలివరీని స్వీకరిస్తానని గుడ్డును తాళాలు అడిగాడు. ఆ తర్వాత రెండు రిక్షాలను అద్దెకు తీసుకుని, అందులో టూత్‌పేస్ట్ బాక్సులను ఎక్కించుకుని బస్సులో తన స్వగ్రామమైన బహ్రైచ్‌కు వెళ్లిపోయాడు.