Site icon Prime9

Rahul Gandhi Twitter Bio: రాహుల్ గాంధీ ట్విట్టర్ బయోడేటా మార్పు.. డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా అప్‌డేట్

Rahul Gandhi Twitter Bio

Rahul Gandhi Twitter Bio

 Rahul Gandhi Twitter Bio: పార్లమెంటు సభ్యుడిగా లోక్‌సభకు అనర్హత వేటు పడిన కొద్ది రోజుల తర్వాత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం తన ట్విట్టర్ బయోడేటాని మార్చారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా బయోడేటాని ‘డిస్’ క్వాలిఫైడ్ ఎంపీ’గా అప్‌డేట్ చేశారు.రాహుల్ గాంధీ తన ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది.ఇప్పుడు, అతని ట్విట్టర్ ఖాతా వివరణలో అతని పార్లమెంటు సభ్యత్వంతో పాటు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం గురించి ప్రస్తావించబడింది.

కాంగ్రెస్ పార్టీ సంకల్స్ సత్యాగ్రహం..( Rahul Gandhi Twitter Bio)

ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజుపాటు “సంకల్ప్ సత్యాగ్రహం” ప్రారంభించింది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నారు.జైరామ్ రమేష్, ముకుల్ వాస్నిక్, పవన్ కుమార్ బన్సల్, శక్తిసిన్హ్ గోహిల్, జోతిమణి, ప్రతిభా సింగ్ మరియు మనీష్ చత్రత్ కూడా నిరసన ప్రదేశంలో ఉన్నారు.పార్టీ ఢిల్లీకి చెందిన పలువురు నాయకులు కూడా నిరసనలో పాల్గొన్నారు.సత్యాగ్రహానికి పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వేదిక వెలుపల గుమిగూడారు.

శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ కారణాల వల్ల సత్యాగ్రహానికి అనుమతి తిరస్కరించబడిందని మరియు రాజ్‌ఘాట్ మరియు పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక లేఖలో తెలిపారు.ఢిల్లీ పోలీసుల చర్యపై వేణుగోపాల్ ట్విటర్‌లో స్పందిస్తూ, పార్లమెంటులో మా గొంతును నిశ్శబ్దం చేసిన తరువాత, బాపు (మహాత్మా గాంధీ) సమాధి వద్ద కూడా శాంతియుత సత్యాగ్రహం చేయడానికి ప్రభుత్వం నిరాకరించింది.

అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లో నిరసనలు..

ప్రతి ప్రతిపక్షాల నిరసనను అనుమతించకపోవడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇది మమ్మల్ని నిరోధించదు, సత్యం కోసం మా పోరాటం, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కొనసాగుతుంది.2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో పాటు లోక్‌సభకు అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ రాజ్‌ఘాట్ వెలుపల వేదికను ఏర్పాటు చేసింది.అనర్హత వేటుకు నిరసనగా అన్ని రాష్ట్రాలు, జిల్లా కేంద్రాల్లోని మహాత్మాగాంధీ విగ్రహాల ముందు ఒక రోజంతా సత్యాగ్రహం చేయాలని ప్రకటించింది.

Exit mobile version