Site icon Prime9

Varahi : ‘వారాహి’తో పవన్ రెడీ

Varahi

Varahi

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వాహన ట్రయల్ రన్ ను పవన్ కల్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. జనసేన పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు చేశారు పవన్. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోనూ పవన్ చర్చించారు.ఒకసారి బస్సులోకి ఎక్కితే ఇక ఆరోజు యాత్ర ముగిసేంత వరకూ బస్సు దిగాల్సిన అవసరం ఉండదు. వాహనం చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసుకునేలా బస్సును తయారు చేశారు. గత కొద్ది నెలలుగా శ్రమించి ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించారు. అన్ని హంగులతో రూపొందించిన ఈ వాహనంలోనే పవన్ కల్యాణ్ ఏపీ మొత్తం పర్యటించనున్నారు.

వాస్తవానికి పవన్ కల్యాణ్ విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంది. కానీ , అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసిన తర్వాతనే బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకుని వాయిదా వేసుకున్నారు. బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ త్వరలోనే తేదీలను ప్రకటిస్తారు.

Exit mobile version