APSRTC: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసి శుభవార్త చెప్పింది. సాధారణ చార్జీలతో వారి వారి స్వస్ధలాలకు వెళ్లవచ్చని తీపి కబురు అందించింది. విజయవాడ నుండి పలు ప్రాంతాలకు 1081 అదనపు బస్సులు నడుస్తాయని పేర్కొనింది. విజయవాడ నుండి విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భద్రాచలం, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు ఏపీఎస్ఆర్టసీ ప్రకటించింది. ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసిన్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రముఖ ఆలయాలు, పుణ్యక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతాయి. దసరా సెలవులు కూడా రావడంతో ప్రజలు తమ తమ స్వస్ధలాలకు పయనమౌతారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా నడిపే ఆర్టీసి బస్సుల ఏర్పాటు సామాన్యులకు, ప్రజలకు ఓ తీపి కబురని చెప్పాల్సిందే.