Minister Botsa Satyanarayana: భోగాపురం ఎయిర్‌పోర్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. టీడీపీ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఎయిర్‌పోర్టును తీసుకొస్తే టీడీపీ నేతలకు ఏడుపెందుకని విమర్శించారు. ఎయిర్‌పోర్టును మూడేళ్లలో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని రైతులతో సంప్రదింపుల తర్వాతే భూసేకరణ చేశామని తెలిపారు. చంద్రబాబు ఏది చేసినా తన రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తారని బొత్స వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రపై మీకు ఎందుకంత అక్కసు?..( Minister Botsa Satyanarayana)
చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న మీడియా తమ అక్కసును ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎప్పుడయినా రైతులతో సమావేశాలు నిర్వహించారా? వారి సమస్యలు తీర్చడానికి ప్రయత్నాంచారా? అంటూ బొత్స ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై మీకు ఎందుకంత అక్కసు? రాజధాని పెడతానన్నా వద్దంటారు. గంటకో మాట మాట్లాడుతారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకోసం నిన్న పండుగలా భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్దాపన కార్యక్రమం జరిగింది. మత్స్యకారులకోసం ఫ్లోటింగ్ జెట్టీని ఏర్పాటు చేస్తున్నారు.
అందుకే 2,300 ఎకరాలకు కుదించారు..
టీడీపీ హయాంలో 12,000 ఎకరాలకోసం మీరు సర్వే జరపలేదా? అపుడు జగన్మోహన్ రెడ్డి అంత భూమి అవసరం లేదని పోరాటం చేసిన విషయం వాస్తవం. అందుకే దానిని ప్రస్తుతం 2,300 ఎకరాలకు కుదించారు. మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరైతైనా చెప్పారా? రైతులందరితో సంప్రదించి కోర్టు లిటిగేషన్లు అధిగమించి ఈ కార్యక్రమాన్ని చేసాము. ఇది విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయమే. ఆరోజు విమానయాన మంత్రిగా ఉన్న వ్యక్తి మీ మంత్రి మీరు కార్యక్రమం చేస్తే ఎందుకు రాలేదు? ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఎక్కడో కూర్చున్నారని బొత్స విమర్శించారు. అపుడు ఉన్న పరిస్దితి ఇపుడు లేదు. అందరూ ఎయిర్ పోర్టు రావాలని కోరుతున్నారని బొత్స అన్నారు.
https://youtu.be/6cWXoJtPw0s