Site icon Prime9

KA Paul : రైతు వేషంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

KAPal

KAPal

KA Paul:  ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో రోజుకో గెటప్ లో మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన పాల్.. తాజాగా రైతు వేషంలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని.. రైతులతో కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి నడుస్తూ సమస్యలను అడిగి తెలుసుకుని తాను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు ఓటు వేస్తే అభివృద్ది జరగదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు చేసేదేమి లేదన్నారు. ఓట్ల కోసం మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ధర్మం వైపే ఉంటారని కేఏ పాల్ అన్నారు. త. ఎవరెన్ని కుట్రలు చేసినా తనను ఎవరూ ఆపలేరని పాల్ చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

Exit mobile version