Site icon Prime9

Health Benefits of Yams: చామదుంపలను తినడం వల్ల కలిగే లాభాలివే..

Health Benefits of Yams: మ‌నం వివిధ ర‌కాల దుంప‌ల‌ను కూడా కూర‌గాయ‌ల రూపంలో ఆహారంగా తీసుకుంటాం. అలాంటి వాటిల్లో చామ దుంప‌లు కూడా ఒక‌టి. ఇవి జిగురుగా, బంకంగా ఉంటాయి అనే కారణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ చామ దుంప‌ల‌ను త‌ప్ప‌కుండా తినాల‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌రల్స్ తోపాటు ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి.

చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే ఇతర దుంపల్లా వీటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను తినవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. చామదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి6 హైబీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. మహిళల్లో మెనోపాజ్‌లో వచ్చే సమస్యలు తగ్గాలంటే చామ దుంపలను తినాలి. గర్భిణీలు చామదుంపలను తినడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తదితర లక్షణాలు తగ్గుతాయి. చామదుంపల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, త‌ల‌తిర‌గ‌డాన్ని త‌గ్గించ‌డంలో కూడా చామ దుంప‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. క‌నుక‌ చామ దుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్సర్ ల బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.వ‌ర్షాకాలంలో మ‌నం వైర‌స్, బాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ చాము దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఈ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన మ‌నం ప‌డ‌కుండా ఉంటాం. క‌నుక ఈ చామ దుంప‌ల‌ను కూర‌గా, వేపుడుగా లేదా పులుసుగా చేసుకుని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version