Site icon Prime9

Chennai: రైల్వే ప్లాట్ ఫారమ్ నుంచి ఐఏఎస్ అధికారి వరకూ.. ఒక యువకుడి ప్రయాణం..

Prabakaran_ From railway platform to IAS officer

Prabakaran_ From railway platform to IAS officer

Chennai: చాలా మంది కలలు కంటారు. కాని ఆ కలలను సాకారం చేసుకునేది కొంతమందే. ఎందుకంటే ప్రయత్నం చేయనివారు కొంతమంది అయితే మధ్యలో వైఫల్యాలు ఎదురై వెనక్కి తగ్గేవారు మరికొంతమంది. చివరివరూ నిలబడి గెలిచే వారు కొంతమందే. తమిళనాడుకు చెందిన శివగురు ప్రభాకరన్ ఈ కోవలోకే వస్తాడు. పేదరికాన్ని, కష్టాలను ఎదుర్కొని తన స్వప్నమయిన సివిల్ సర్వీస్ ను సాదించాడు.

తమిళనాడులోని తంజావూరుజిల్లాకు చెందిన శివగురు ప్రభాకరన్ రైతు కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మద్యానికి బానిస కావడంతో అతని తల్లి మరియు సోదరి పగలు పొలంలో పని చేస్తూ, రాత్రి పూట జీవనోపాధి కోసం బుట్టలు అల్లేవారు. రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్న వారిని చూసి శివగురువు కూడా తన చదువును వదిలేసి సామిల్ ఆపరేటర్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.నేను రెండు సంవత్సరాలు సామిల్ ఆపరేటర్‌గా పని చేసాను. వ్యవసాయ కూలీగా చేసాను. నేను సంపాదించిన దానిలో నా కుటుంబానికి కొంత ఖర్చు చేసి మిగిలినది నా చదువు కోసం పొదుపు చేసాను. నా కలలను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను అని శివగురు ఒక ఇంటర్యూలో చెప్పాడు.

తాను జీవితంలో ఎదగాలంటే చదువుకోవడం తప్పనిసరని శివగురు భావించాడు. 2008లో తన సోదరి వివాహం చేసిన తరువాత తాను కూడా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెల్లూరులోని తాంథై పెరియార్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాడు.తరువాత ఐఐటీలో పీజీ చేయాలని నిర్ణయించుకున్నాడు “ఒక స్నేహితుడు అతడిని సెయింట్ థామస్ మౌంట్‌లోని ఒక ట్యూటర్‌కి సూచించాడు, అతనునిరుపేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు. వీకెండ్ లో చదువుకోవడం మరియు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లపై పడుకోవడం చేసేవాడు. తిరిగి సోమవారం వేలూరు కళాశాలకు కు తిరిగి వచ్చేవాడు. మరోవైపు డబ్బులకోసం పార్ట్‌టైమ్ పనిచేశాడు. చివరకు ఐఐటీ మద్రాస్ లో ఎంటెక్ సీటు సంపాదించాడు. మంచి మెరిటితో ఎంటెక్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్దమయ్యాడు.

Exit mobile version