Site icon Prime9

Biggest data theft: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ముఠా గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

data theft

data theft

Biggest data theft:దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఫోన్‌లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 16.8 కోట్ల మంది డేటాను సేకరించి విక్రయించినట్లు విచారణలో గుర్తించారు.యూపీకి చెందిన కుమార్ నితీష్ భూషణ్.. మరికొంత మందితో కలిసి డేటా చోరీకి పాల్పడుతున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సైబర్‌ నేరగాళ్లు.. వినియోగదారులకు బ్యాంకులు, సిమ్‌ కార్డుల పేరుతో మెసేజ్ లతో పాటు లింకులను పంపుతున్నట్లు గుర్తించారు.

లింకులు పంపి డేటా తస్కరిస్తున్నారు..(Biggest data theft)

సైబర్ నేరగాళ్లు పంపిన లింకులను తెలియక క్లిక్‌ చేసిన వారి వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు డీటెయిల్స్‌ను కొట్టేసినట్లు విచారణలో తేల్చారు. ఇటువంటి మెసేజ్‌లపై ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.ఈ ముఠా కొన్ని కోట్ల మంది డేటాను చోరీ చేసింది. ఇన్సూరెన్స్ లోన్ కోసం అప్లై చేసిన నాలుగు లక్షల మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేసింది. 7 లక్షల మంది ఫేస్‌బుక్ యూజర్స్ డేటాను దొంగలించింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు కూడా లీక్ అయ్యాయి. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారు.

డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను సైతం ఈ ముఠా చోరీ చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టారు. డేటా మెుత్తాన్ని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. నిందితులు ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కోసం ఒక ఏజెన్సీని పెట్టుకున్నారు. ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నాడు. చోరికి గురైన వ్యక్తిగత డేటాను రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. డేటా చోరీ కేసు సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐపీఎస్ అధికారితో సిట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చారు.

Exit mobile version