New secretariat: నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని కేసీఆర్ అవిష్కరించారు. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు

  • Written By:
  • Updated On - April 30, 2023 / 04:53 PM IST

New secretariat: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని కేసీఆర్ అవిష్కరించారు. ముందుగా హోమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు చేరుకుని తన సీటులో కూర్చున్నారు. అనంతరం ఆరు ఫైళ్ల పై సంతకాలు చేసి పరిపాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు సమర్పించారు. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, తదితరులు సీఎం కేసీఆర్ కు పాదాభివందనం చేశారు. తనంతరం మంత్రులు తమ ఛాంబర్లలో కొలువుదీరి.. తమ శాఖలకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు చేశారు. వేదపండితులు సీఎం కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు.

ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తెలంగాణ..(New secretariat)

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పరిపాలనకు సచివాలయం గుండెకాయ లాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. సచివాలయాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్న కేసీఆర్.. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో పరిపాలన సాగుతోందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెడుతున్నామని చెప్పారు.
కొందరు పిచ్చి మాటలు మాట్లాడారని మరుగుజ్జుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.నాడు గోదావరిలో పైసలు వేద్దామంటే నీళ్లు లేని పరిస్థితి ఉంటే నేడు
ఎండాకాలం కూడా నీళ్లు మత్తడి దూకడమే పునర్‌నిర్మాణం అని కేసీఆర్ అన్నారు. నేడు తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిందని అన్నారు.

కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆరు ఫైళ్లపై సంతకాలు చేసారు. వీటిలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై తొలి సంతకం చేసారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభినందించారు.

https://youtu.be/MCURK9SKggU