Bihar Daily labourer: మద్యపాన నిషేథం అమల్లో ఉన్న బీహార్‌లో ఒక దినసరి కార్మికుడికి ఇవ్వాల్సిన వేతనంగా రెండు మద్యం సీసాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక కార్మికుడు టవల్‌తో దాచిన మద్యం బాటిళ్లను చూపించాడు. తనకు సీసాలు ఎవరు ఇచ్చారని అడిగినప్పుడు, వైశాలి మహువా పోలీస్ స్టేషన్ సిబ్బంది తనకు కూలిగా మద్యం ఇచ్చారని చెప్పాడు. ఈ ఘటన జనవరి 21న జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు పోలీసులు తనను మరియు ఇతర కార్మికులను పిలిచారని కార్మికుడు పేర్కొన్నాడు. బాటిళ్లను ధ్వంసం చేసిన తర్వాత రెండు బాటిళ్లను కూలిగా ఇచ్చారు.
ఇది పరిపాలన లోపం..(Bihar Daily labourer)
మహువా పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ ప్రభాత్ రంజన్ సక్సేనాను సంప్రదించినప్పుడు మేము గత 15 రోజులుగా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేయలేదు. డ్యూటీ మేజిస్ట్రేట్ మరియు పోలీసు అధికారుల సమక్షంలో మద్యం ధ్వంసం చేయబడుతోంది. మద్యం సరుకును నాశనం చేయడం జరుగుతుంది. ఈ వీడియో పాతది కానీ ఇది పరిపాలనా లోపానికి స్పష్టమైన సూచన అంటూ అంగీకరించారు.జిల్లా యంత్రాంగంపై కుట్ర చేయడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా వీడియోను రూపొందించే అవకాశం కూడా ఉంది. మేము దానిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సక్సేనా తెలిపారు.బీహార్‌లో 2016 ఏప్రిల్ నుంచి మద్యాన్ని నిషేధించారు.
చెరువులో దాచిన మద్యం..
మార్చి 3న బీహార్‌లోని వైశాలి జిల్లాలోని హర్‌పూర్ గ్రామంలోని చెరువులో దాచిన సుమారు 17 కార్టన్‌ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్‌స్టేషన్ ఇంచార్జి వైశాలి సురేష్ ప్రసాద్ చౌదరి తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ వేడుకల కోసం హర్యానా నుంచి ప్రత్యేక మద్యం తెప్పించారు. హోలీని దృష్టిలో ఉంచుకుని వైశాలి జిల్లాలో మద్యం మాఫియా చురుగ్గా మారిందని, పోలీసులను మభ్యపెట్టేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని చౌదరి అన్నారు.
అయితే చేపల చెరువులో దాచిన లక్షల రూపాయల విలువైన మద్యాన్ని వెలికితీయడంలో ఎక్సైజ్ శాఖ బృందం విజయం సాధించింది. వాస్తవానికి మహువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హర్‌పూర్ గ్రామంలోని ఓ చెరువులో హోలీ సందర్భంగా వినియోగించేందుకు వీలుగా నీటి అడుగున పెద్దమొత్తంలో విదేశీ మద్యాన్ని దాచి ఉంచినట్లు ఎక్సైజ్ శాఖ బృందానికి రహస్య సమాచారం అందింది. బృందం ఆ స్థలంపై దాడి చేయగా విదేశీ మద్యం దొరికింది.