Site icon Prime9

BJP MLA: సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకులను కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే.. ఎక్కడో తెలుసా?

BJP MLA

BJP MLA

 BJP MLA: గుజరాత్‌లోని రాజులా నగరానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హీరా సోలంకి సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకులను రక్షించి ప్రశంసలు అందుకుంటున్నారు. నలుగురు యువకులు పట్వా గ్రామం సమీపంలోని సముద్ర తీరంలో చేయడానికి వెళ్లిన సందర్బంగా మునిగిపోవడం ప్రారంభించారు.

ముగ్గురిని బయటకు తీసి.. ( BJP MLA)

ఈ ఘటన గురించి తెలుసుకున్న సోలంకి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మరికొంత మంది సాయంతో యువకులను రక్షించేందుకు సముద్రంలోకి దూకారు. ముగ్గురు యువకులను బయటకు తీశారు. అయితే, నాల్గవ వ్యక్తిని రక్షించలేకపోయారు, అతని మృతదేహాన్ని సుదీర్ఘంగా సోదించిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిని కల్పేష్ షియా, నికుల్ గుజారియా, విజయ్ గుజారియా, జీవన్ గుజారియాలుగా గుర్తించారు.

సోలంకి యువతను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో స్దానికులు అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో ఇటీవల ఐదుగురు చిన్నారులు కృష్ణసాగర్ సరస్సులో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలు సరస్సులో ఈత కొడుతుండగా వారు మునిగిపోవడం ప్రారంభించారు. దీంతో వారిని కాపాడేందుకు మరో ముగ్గురు సరస్సులోకి దూకి చివరికి వారు కూడా మునిగిపోయారు.

Exit mobile version
Skip to toolbar