Drug Addicts: అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.
డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే..(Drug Addicts)
మాదక ద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ అధ్యక్షుడు మెహబూబ్ ముక్తార్ తెలిపారు. తమ ప్రాంతంలో చాలా మంది యువకులు అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారని, చాలా మంది పిల్లలు డ్రగ్స్‌కు బానిసలుగా మారారని ఆయన అన్నారు. అటువంటి వారు చనిపోతే వారిని ఖననం చేయడానికి మేము అనుమతించబోము. మా ప్రాంతంలో మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం అని మెహబూబ్ ముక్తార్ అన్నారు.
డ్రగ్స్ పై పెద్ద యుద్దమే చేసాము..
శ్మశానవాటిక కమిటీ నిర్ణయంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ, గత రెండేళ్లలో, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్‌పై తాము అత్యంత ప్రభావవంతమైన యుద్ధం చేసామన్నారు.మొత్తం 9,309 మందిని అరెస్టు చేశామని ,రూ.1,430 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని, 420 ఎకరాల్లో గంజాయి, నల్లమందు సాగును ధ్వంసం చేశామని తెలిపారు.గత రెండేళ్లలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన యుద్ధం చేశాం, వినియోగం మరియు సరఫరా నెట్‌వర్క్‌లకు తీవ్ర నష్టం కలిగించాం అని ఆయన ట్వీట్ చేశారు.