Jagannath Temple: బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. భారతదేశం వెలుపల ఆలయానికి అందించిన అతిపెద్ద విరాళాలలో ఇది ఒకటి. పట్నాయక్ ఒడిశానుంచి బ్రిటన్ కు వచ్చారు.
శ్రీ జగన్నాథ సొసైటీ ఆదివారం అక్షయ తృతీయ నాడు జరిగిన ప్రారంభ జగన్నాథ్ కన్వెన్షన్ సందర్భంగా ఆయన విరాళాన్ని అందిస్తానని చెప్పారు. ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ మరియు వ్యవస్థాపకుడు అయిన పట్నాయక్, జగన్నాథ భక్తులను కలిసి పని చేయాలని యూకేలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించాలనే కలను సాకారం చేసుకోవాలని ప్రోత్సహించారు.
లండన్ శివార్లలో దాదాపు 15 ఎకరాల అనువైన భూమిని సేకరించేందుకు కేటాయించిన రూ.250 కోట్లలో రూ.70 కోట్లతో జగన్నాథ ఆలయ నిర్మాణం వేగంగా సాగుతోంది. మొదటి దశ నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ సందర్బంగా శ్రీ జగన్నాథ సొసైటీ యూకే చైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్, లండన్‌లోని జగన్నాథ ఆలయం యూరప్‌లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని మరియు వేలాది మంది భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.