Site icon Prime9

Amigos Trailer: ఒకే పోలికతో ముగ్గురు.. ఆసక్తిగా అమిగోస్ ట్రైలర్

amigos

amigos

Amigos Trailer: మరో నూతన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటించిన గత చిత్రం.. బింబిసార విజయంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా.. రాజేంద్ర రెడ్డి నూతన దర్శకుడి సినిమాలో త్రిపాత్రభినయం చేస్తున్నాడు. అమిగోస్ అనే చిత్రంతో.. ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఉత్కంఠగా ఉండటంతో.. ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార మూవీతో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్.. రెండు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బింబిసార సినిమాను.. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా భారీ వసూళ్లతో కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇప్పుడు మరో సరికొత్త కథతో మనముందుకు వస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ సరసన కన్నడ అందం ఆషికా రంగనాథన్ నటిస్తోంది.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఎక్కడా కథను రివీల్ చేయకుండా మూవీ టీం జాగ్రత్త పడింది. ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తుల కలయిక ఎన్ని విధ్వంసాలను సృష్టించిందో చూపించడమే ఈ సినిమా కథ.

Amigos Trailer | Nandamuri Kalyan Ram | Ashika Ranganath | Rajendra Reddy | Ghibran

ఈ సినిమాలో మాఫియా డాన్, డ్రగ్ డీలర్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. పేరు బిపిన్.. చీకటి రాజ్యానికి రారాజు.

అతని కోసం ఎన్నో దేశాల్లో పోలీసులు వెతుకుతూ ఉంటారు.

వారి నుంచి తప్పించుకోవడానికి బిపిన్.. తనలానే ఉన్న మరో ఇద్దరినీ వెతికి పట్టుకొని వారితో కలిసి స్నేహం చేస్తాడు.

ఆ తర్వాత వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. మిగతా ఇద్దరి జీవితాల్లో బిపిన్ ఎలాంటి తుఫాన్ రేపాడు.?

ఆషికాను ప్రేమించిన కళ్యాణ్ రామ్ ఎవరు..? అసలు బిపిన్ కు తనలాగే ఉన్న మరో ఇద్దరితో ఉన్న బంధం ఏంటి..? అనేది తెరపై చూడాల్సిందే.

చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్.. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మూడు పాత్రల్లో కళ్యాణ్ రామ్ చక్కగా ఒదిగిపోయాడు.

ఇది వరకే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. తాజాగా ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరగనున్నాయి.

రాజేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఈనెల 10వ తేదీన అమిగోస్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar