Ys Saubhagyamma:ఏపీ సీఎం జగన్ కు తన చిన్నమ్మ ,వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు .ఇప్పటి వరుకు వివేకానంద రెడ్డి హత్య కు సంబంధించి అయన సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పటివరకు జగన్కు లేఖ రాయడం కానీ ,జగన్ ను విమర్శించడం గాని చేయలేదు . తొలిసారి గా సౌభాగ్యమ్మ లేఖ రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది .
సౌభాగ్యమ్మ తన లేఖలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. మీ చిన్నాన్న హత్యలో హంతకులకు కొమ్ము కాయడమే కాకుండా.. హంతకులెవరో తేల్చాలని.. చట్టబద్దంగా శిక్షించాలని పోరాడుతున్న నీ చెల్లెళ్ళు సునీత, షర్మిలకు అండగా నిలబడకపోగా.. వేధింపులకు గురిచేయడం ఎంత వరకు సమంజసం అని లేఖలో సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. 2009లో మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయినప్పుడు నువు ఎంత మనోవేదన అనుభవించావో….2019లో నా భర్త వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు నేను.. నా కుమార్తె సునీత కూడా అంతే మనోవేదన అనుభవించామని ఆమె పేర్కొన్నారు. కుటుంబంలోని వారే మీ చిన్నాన్న హత్యకు కారణం కావడం మమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది. నిన్ను సీఎంగా చూడాలని తపించిన మీ చిన్నానన్నపై నీ పత్రిక, టీవీ ఛానెల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వాళ్లు దుష్ప్రచారం చేయడం మాకు ఎంతో భాదను కలిగిస్తుందోని అన్నారు. ఇది నీకు తగునా జగన్ అంటూ ఆ లేఖలో సౌభాగ్యమ్మ జగన్ ను ప్రశ్నించారు . అదే విధంగా సునీతకు మద్దతుగా నిలిచిన షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏమిటని అడిగారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం..
నిజం వైపు నిలబడాలని ఈ లేఖలో జగన్ ను సౌభాగ్యమ్మ తన లేఖలో కోరారు.