YS Sharmila Comments: సొంత చిన్నమ్మ లెటర్ రాస్తే కూడా పట్టించుకోని జగన్ నీది గుండెనా .లేక్ బండనా అంటూ అన్న జగన్ పై వైఎస్ షర్మిల విరుచుకు పడింది . గురువారం గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న షర్మిల ఏపీ ,సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టింది .
వివేకానంద హత్య కు సంబంధించి అయన భార్య సౌభాగ్యమ్మ జగన్ కు లెటర్ రాసిన అసంగతి తెలిసిందే .అయితే దీని పై జగన్ ఇంత వరుకు స్పందించకపోవడంతో షర్మిల ఆవేదన వ్యక్తం చేసారు . మీలో ఉన్నది గుండెనా..? బండనా? సొంత చిన్నాన్నను చంపిన వారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. హంతకులను రక్షిస్తూ వాళ్ళకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని షర్మిల అన్నారు .వివేకానంద గురుంచి ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదని , వివేకాకు రెండో పెళ్లి అయ్యిందని , ఇంకో సంతానం ఉందని తన సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు షర్మిల . వివేకా ప్రజా నాయకుడు అని గానీ.. వైఎస్ఆర్ కి తమ్ముడు అనేది మాత్రం మర్చిపోయారని షర్మిల అన్నారు . వైసీపీ కోసం ఎంతో పనిచేసిన బాబాయ్ ఇప్పుడు గుర్తుకు రావడంలేదని,అదే విధంగా సొంత చెల్లెలు మీద ఇంగితం లేకుండా సీఎం జగన్ మాట్లాడుతున్నారని షర్మిల అన్నారు .
నా చీరపైన కామెంట్సా? (YS Sharmila Comments)
వేలమంది పాల్గొన్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టలు మీద ఎవరైనా ప్రస్తావిస్తారా అంటూ షర్మిల నిలదీశారు. నేను బాబు దగ్గర మోకరిల్లానని , పసుపు చీర కట్టుకున్నానని జగన్ అంటున్నారు .పసుపు ఎవరికీ పేటెంట్ కాదు .అది మంగళ ప్రదమైన రంగు . గతంలో సాక్షి ఛానెల్ కి పసుపు రంగు ఉండేది. అది టీడీపీ సొంతం కాదు అని షర్మిల ఆక్షేపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు చీర గురించి మాట్లాడతారా? నా ఒంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? అసలు సంస్కారం ఉందా? అంటూ షర్మిల విమర్శించారు . రాసిచ్చిన స్క్రిప్ట్ చూసుకుంటూ చదివేది, మక్కీకి మక్కీ చదివేది జగన్ , నేను వైఎస్ఆర్ బిడ్డను.. నాకు ఒకరి దగ్గర మోకరిల్లె అవసరం లేదని తేల్చి చెప్పారు షర్మిల . మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు. బీజేపీ దగ్గర మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు. జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు. మోదీకి వారసుడు క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికాడు అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.