Site icon Prime9

Nirmal: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటు

Adilabad

Adilabad

Nirmal:పెళ్లి వేడుకలో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిపోయాడు (Nirmal)

పార్డి గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుని వివాహం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. పెళ్లి అనంతరం శనివారం.. రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా పెళ్లి కుమారుని సమీప బంధువు.. ముత్యం అనే యువకుడు బరాత్ లో డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన బంధువులు.. యువకుడిని లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే యువకుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ యువకుడిది మహారాష్ట్రలోని శివుని గ్రామం. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

https://twitter.com/KP_Aashish/status/1629725986312036353?s=20

ఈ మధ్య ఎక్కువ గుండెపోటు కేసులు..

ఈ మధ్య చాలామంది ఉన్నట్టుండి గుండెపోటుకు గురవుతున్నారు. వయసు మళ్లిన వారికి మాత్రమే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇటీవలే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నుంచి ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. మరి గుండె జబ్బులు రావడానికి గల కారణాలేంటి. కరోనా మానవుని జీవన విధానంపై చాలా మార్పులు తీసుకువచ్చింది. కరోనా కాలం నుంచి ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడి సమయం లేకుండా గడిపేస్తున్నారు. ఆహారపు అలవాట్లు, శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం వల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయులే సగటున పది సంవత్సరాల ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెపోటుకు గురువుతున్న వారిలో చాలామంది మధ్య వయస్కులే కావడం విషాదం. వాస్తవానికి 20 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులలో ప్రతి 5 మందిలో ఒకరు గుండె జబ్బులతో బాధపడుతున్నారని తెలుస్తోంది. గుండె జబ్బులకు ప్రధాన కారకాలు ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్. వీటిని నియంత్రణలో ఉంచడం వల్ల చాలా రోగాలను మన దరిచేరకుండా ఉంచవచ్చు.

తాజాగా ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. సికింద్రాబాద్ లో ఓ కానిస్టేబుల్ వ్యాయమం చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. మరో వీడియోలో పెళ్లి వేడుకలో పాల్గంటున్న సమయంలో వ్యక్తికి గుండెపోటు వచ్చి.. అక్కడికక్కడే మృతి చెందాడు.

Exit mobile version