Site icon Prime9

Crime News : ఏపీలో ప్రేమోన్మాది ఘాతుకం… యువతిపై కత్తితో దాడి… అడ్డొచ్చిన తల్లి, చెల్లిపై కూడా

young man attacked with knife on girl and her family members in west godavari

young man attacked with knife on girl and her family members in west godavari

Crime News : మహిళలపై, అమ్మాయిలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ఎన్నో చట్టాలను ప్రవేశపెడుతున్నప్పటికి మృగాళ్ల బారి నుంచి వారిని కాపాడలేకపోతున్నాం. కాగా తాజాగా ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం అర్ధరాత్రి మాణిక్యం అనే యువతిపై రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. కాగా అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మీని, తల్లి భాగ్యలక్ష్మీపైనా కూడా ఆ కిరాతకుడు దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ విషయం తెలుసుకుని క్షతగాత్రులను స్థానికులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయాలపాలైన ముగ్గురిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఇంకా తెలియాల్సి ఉంది. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ మాణిక్యం వెంట పడుతున్న కళ్యాణ్‌ను ఆమె తండ్రి ఏడుకొండలు పలుమార్లు హెచ్చరించాడు.

దీంతో గతంలో రెండు సార్లు ఏడుకొండలు పశువుల మేతకు కళ్యాణ్ నిప్పు పెట్టాడు. అంతటితో ఊరుకోకుండా తనను ప్రేమించడంలేదనే అక్కసుతో మాణిక్యంపై దాడికి పాల్పడ్డాడని సమాచారం అందుతుంది. కాగా ఈ ఘటనపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar