Site icon Prime9

Kurnool: వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుంది.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

Kurnool

Kurnool

Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వీఆర్‌వో, వీఆర్ఏలను తొలగిస్తే గ్రామాలకు పట్టిన పీడ పోతుందని వ్యాఖ్యానించారు. వాళ్లను అటెండర్లుగా పంపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారిపై పర్యవేక్షణకు అధికారిని నియమించాలన్నారు

మైనార్టీలను వ్యతిరేకించే బీజేపీ గోవును అడ్డుపెట్టుకొని రాష్ట్రాలను పరిపాలించాలని చూస్తోందని గతంలో చెన్న కేశవ రెడ్డి ఆరోపించారు. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారతదేశంలో కాలం చెల్లిన చట్టాల్లో గోవధ చట్టం ఒకటన్నారు. బక్రీద్ పండుగ రోజున బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగదళ్.. గోవధ చట్టాన్ని వివాదంగా మారుస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా గోవధ చట్టం అమలులో లేదని వివరించారు. లౌకిక దేశంలో గోవు పూజించే వారికి పూజించే వస్తువని, తినే వారికి ఆహార వస్తువన్నారు దీనిపై అప్పట్లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు సైతం దిగాయి. అలాగే దేశంలో మోడీని ఢీకొన్న మొనగాడు కేసీఆరేనంటూ చెన్నకేశవ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

చెన్నకేశవ రెడ్డి 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత..ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీవీ మోహన్ రెడ్డి పైన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లోనూ మరోసారి వరుస విజయం సాధించారు. వైసీపీ నుంచి 2012 ఉప ఎన్నికల సమయంలో ఎమ్మిగనూరు నుంచి మరోసారి బీవీ మోహన్ రెడ్డి పైన గెలిచి మూడో సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి జయనాగేశ్వర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్ధి జయనాగేశ్వర రెడ్డి పైన విజయం సాధించారు.

 

Exit mobile version