YCP tweet: శివరాత్రి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. పండుగ వేళ వైసీపీ చేసిన ఓ ట్వీట్ పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. అది వైసీపీ, బీజేపీ మధ్య ట్వీట్ వార్‌కు దారితీసింది. అంతటితో ఆగకుండా రెండు పార్టీల నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
హిందువులను అవమానించిన వైసీపీ క్షమాపణ చెప్పాలి..(YCP tweet)
మహా శివరాత్రి వేళ వైసీపీ ఒక ట్వీట్ చేసింది. అందులో జగన్ శివుడి ఆకారంలో ఉన్న బాలుడికి పాలు పడుతున్నట్లుగా ఉంది. ఆకలి తీర్చడానికే శివారాధన అంటూ కాప్షన్ పెట్టారు.
ఈ పోస్టర్ అధికారికంగా వైసీపీ హ్యాండిల్ లోనే పోస్టు చేశారు. దీని మీద బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది హిందువులను అవమానించడమే అని మండిపడుతోంది. దీనికి జగన్ పార్టీ ప్రెసిడెంట్ హోదాలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. ఇక బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే దీని మీద ఆందోళన చేపడతామని కూడా హెచ్చరించారు.
ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే చర్య అని సోము వీర్రాజు అంటున్నారు. ఈ విధంగా చేస్తారా అంటూ అని ఆయన ఫైర్ అవుతున్నారు. దేవుడు అంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా పార్టీకి మరియు బెయిల్ పై ఉన్న సీఎంకు పండగలకు తిండి పెట్టాలని హిందువులకు బోధించే నైతిక హక్కు లేదు.పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది అత్యంత అవమానకరమైన పోస్టర్ అని ఏపీ బీజేపీ ఇన్ చార్జి సునీల్ ధియోధర్ ట్వీట్ చేసారు.
మేము కూడా హిందువులమే..
అయితే దీనికి వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. శివరాత్రి వేళ చేసిన ఆ ట్వీట్‌లో తప్పేముందని ప్రశ్నించారు. శివారాధన అంటే ఆకలి గొన్న వారి ఆకలి తీర్చడమే అన్నారు. మరి తపప్పు ఎక్కడ నుంచి వచ్చిందని బొత్స ప్రశ్నించారు. తాము కూడా హిందువులమే అని, తమకు ఎక్కడా కనబడని తప్పు వారికి ఎలా కనిపించిదని బొత్స సత్యనారాయణ అంటున్నారు. కేవలం రాజకీయం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని ఆయన బీజేపీ నేతల మీద హాట్ కామెంట్స్ చేశారు. ఏదో వంక చూసుకుని రాజకీయాలు చేద్దామంటే ఎలా అంటూ బీజేపీ నేతల తీరును తప్పు పట్టారు. ఏపీ సీఎం ఆచరించే ధర్మం వేరు.. మా ధర్మాన్ని కించపరుస్తారా అని బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కి వైసీపీ నుంచి కూడా గట్టిగానే జవాబు వస్తోంది
ఇదిలా ఉంటే బీజేపీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఇపుడు తమ వైపు తిప్పుకునే పనిలో ఉంది. ఆ కులానికి సంబంధించి మద్దతుగా మాట్లాడుతోంది. ఒక జిల్లాకు.. ఆ కులంలో పుట్టిన వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలనిని కూడా డిమాండ్ చేస్తోంది. దాంతో పాటుగా హిందూత్వ అజెండాను మరో మారు గట్టిగా రాజేసే పనిలో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.