Site icon Prime9

YCP third List: 21మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

YCP

YCP

YCP third List: అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్‌ చేస్తూ.. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం.. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది.

మూడో జాబితాలో అభ్యర్దులు..(YCP third List)

సూళ్లూరుపేట: గురుమూర్తి,
చిత్తూరు: విజయానంద రెడ్డి
మార్కాపురం: జంకె వెంకటరెడ్డి
రాయదుర్గం: మెట్టు గోవిందరెడ్డి
తిరువూరు: నల్లగట్ల స్వామిదాసు,
పూతలపట్టు: డా. సునీల్
పెడన: ఉప్పల రాము,
పెనమలూరు: జోగి రమేశ్
విజయనగరం: చిన్న శ్రీను,
విశాఖ:బొత్స ఝాన్సీ
ఆలూరు: విరూపాక్షి,
శ్రీకాళహస్తి: బియ్యపు మధుసూదన్‌రెడ్డి
గూడూరు: మెరుగు మురళి,
దర్శి: బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
చిత్తూరు: విజయానందరెడ్డి,
గంగాధర నెల్లూరు: కృపా లక్ష్మి
ఏలూరు (ఎంపీ):కారుమూరి సునీల్ కుమార్
అనకాపల్లి (ఎంపీ): అడారి రమాకుమారి
విశాఖ ఎంపి అభ్యర్థిగా బొత్స ఝాన్సీ
కర్నూలు ఎంపి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం
శ్రీకాకుళం ఎంపి అభ్యర్థిగా పేరాడ తిలక్

Exit mobile version