Site icon Prime9

MP Srikrishna Devarayalu: వైసీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

Srikrishna Devarayalu

Srikrishna Devarayalu

MP Srikrishna Devarayalu: వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు నేడు వైసీపీకి రాజీనిమా చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నా వల్ల అనిశ్చితి రాలేదు.. ఇందుకు తాను బాధ్యుడుని కాదని ఆయన అన్నారు. 15రోజులుగా సాగుతున్న అనిశ్చితికి తెరపడాలన్నారు. కొత్త అభ్యర్థివస్తారని చెబుతున్నారు.. దీంతో క్యాడెర్‌లో కన్‌ఫ్యూజన్ నెలకొందని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

సీఎం జగన్ నో చెప్పడంతో..(MP Srikrishna Devarayalu)

గత కొద్దికాలంగా నరసరావుపేట ఎంపీ సీటు నుంచి పోటీచేసే వైసీపీ అభ్యర్దిపై గందరగోళం ఏర్పడింది. ఇక్కడనుంచి బీసీ అభ్యర్దిని బరిలోకి దించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం మరోసారి తానే పోటీ చేస్తానంటూ తెగేసి చెప్పారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్మేలు కూడా అతనికే తమ మద్దుతు తెలిపారు. కానీ జగన్ మాత్రం ససేమిరా అన్నారు. మరోవైపు గత బుధవారం చంద్రబాబుతో శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు.ఈ నేపధ్యంలో చివరకు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పారు.

 

Exit mobile version