Site icon Prime9

MLA Sridhar Reddy: ఏపీ సర్కార్ కు వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ .. అది ఏమిటో తెలుసా?

MLA Sridhar Reddy

MLA Sridhar Reddy

MLA Sridhar Reddy ; వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లను

కూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ఇది తాను ప్రభుత్వానికి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అని ఆయన చెప్పడం విశేషం.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం నలుగురు గన్‌మెన్లను ఇచ్చింది.

అయితే సడన్ గా ఇద్దరు గన్ మెన్లను ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్బంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు.

ఇటువంటి సందర్బంలో తనకు అదనంగా సెక్యూరిటీ ఇవ్వాలని

కాని ఉన్నవారిలో ఇద్దరిని తొలగించారని అన్నారు.

తనకు అభిమానులు, శ్రేయోభిలాషులే రక్షఅని చెప్పారు.

వాస్తవానికి ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే తనకు ఎక్కువ ముప్పు ఉందని అన్నారు.

కంటతడిపెట్టిన గన్ మెన్లు..

తనకు మిగిలిన ఇద్దరు గన్ మెన్లను అప్పగిస్తున్నట్లు ప్రకటించిన శ్రీధర్ రెడ్డి

వారిద్దరిని అలింగనం చేసుకున్నారు. వారు ఇంతకాలం తనతో ఉన్నందుకు

ఆనందం వ్యక్తం చేసారు. అయితే ఇద్దరు గన్ మెన్లు ఎమోషనల్ అయ్యారు

తాజా పరిణామాల నేపధ్యంలో వారు కంటతడి పెట్టారు.

 

నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

వారంరోజులకిందట తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సంచలన ఆరో్పణలు చేసారు.

తాను ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని

ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని తనకు ఒక ఐఏఎస్ అధికారి

చెప్పారని శ్రీధర్ రెడ్ది అన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి

విధేయుడిగా ఉన్నానని వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు.

వాటిని బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ లు ఇబ్బందుల్లో పడతారని అన్నారు.

వైసీపీ నుంచి పోటీ చేయను..ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.

తాను వైసీపీలో ఎన్నో అవమానాలను భరించానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు.

అందువలన తాను పార్టీలో ఉండదలచుకోలేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయనని అన్నారు.

ఇలా ఉండగా మా ఎమ్మెల్యేలపై మేమే ఎందుకు నిఘా పెట్టుకుంటామని

మాజీ మంత్రి పేర్ని నానిప్రశ్నించారు.

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జగన్ కు నమ్మకద్రోహం చేసారు..

సీఎం జగన్ పై కోటంరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేసారని ఆరోపించారు.

శ్రీధర్‌రెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని, అది రికార్డింగ్‌ మాత్రమేనన్నారు.

డిసెంబర్ 25 వ తేదీన శ్రీధర్ రెడ్డి నారా లోకేష్ ని కలిశాడని నాని ఆరోపించారు.

అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలకు టచ్ లో ఉండొచ్చా అని ఆయనప్రశ్నించారు.

సీఎం జగన్ అందరినీ నమ్ముతారని అన్నారు.

నెల్లూరు నారాయణతో టచ్ లో ఉండాలని కోటంరెడ్డికి చంద్రబాబు చెప్పారని అన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version