Site icon Prime9

YCP leaders Heirs: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్లాపడిన వైసీపీ నేతల వారసులు

YCP leaders heirs

YCP leaders heirs

YCP leaders Heirs: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలు తారుమారు చేసాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ పరాజయం మింగుడు పడటం లేదు. తమ పార్టీ అమలు చేసిన సంక్షేమ పధకాలతో ప్రతీ కుటుంబం లబ్దిపొందిందని అందువలన గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మారు. కాని ప్రభుత్వ వ్యతిరేకత ఒక రేంజ్ లో ఉండటంతో ఎన్టీఏ కూటమికి అన్ని జిల్లాల్లో ఓట్ల వర్షం కురిసింది. ఇలా ఉండగా వైసీపీ నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలబరిలోకి దిగిన వారసులు ఓడిపోవడం విశేషం.

 టిక్కెట్లు ఇవ్వడానికి ఇష్టపడని జగన్..(YCP leaders Heirs)

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతల వారసులు పోటీ చేయడానికి సీఎం జగన్ మొదట ఇష్టపడలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారికే తాను టిక్కెట్లు ఇస్తానని వారసులకు ఇచ్చేదిలేదని స్పష్టం చేసారు. అయితే చివరికి వారి ఒత్తిడికి తలొగ్గి కొందరు నేతల వారసులకు టిక్కెట్లు ఇచ్చారు. అయితే వారు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తొలిసారి రాజకీయ అరంగేట్రం వారికి పరాజయాన్ని మిగల్చడం గమనార్హం. తిరుపతి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసిన భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఓడిపోయారు. బందరులో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి,చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి,జీడీ నెల్లూరులో నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి ఓడిపోయారు. . రామచంద్రాపురం నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేసిన షేక్ ముస్తఫా కుమార్తె షేక్ నూరి ఫాతిమా తమ ప్రత్యర్దుల కంటే వెనుకబడి ఉన్నారు. మొత్తంమీద వైసీపీ నేతల వారసులకు ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి

Exit mobile version