Site icon Prime9

Wine shops in AP: ఏపీలో మందు బాబులుకు ఝలక్ ..మూడు రోజులు వైన్ షాపులు బంద్

Wine shops

Wine shops

Wine shops in AP:  ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దింతో జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు..(Wine shops in AP)

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మరో వైపు హోటళ్లు, లాడ్జిలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల వారీగా సిబ్బందిని ఆదేశించారు.బయట నుంచి ఎవరు వచ్చినా విచారించాలని అనుమానం వస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు . అటు సోషల్ మీడియాపై కూడా ఓ కన్నేసి ఉంచాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

Exit mobile version