YCP Opposition Status:ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకు పోతోంది. అధికార వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనబడడంలేదు .ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లల్లో 10 శాతం గెలవాలి.ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు వున్నాయి .దీనిలో 10 శాతం అంటే 18 స్థానాలు రావాలి. ట్రెండ్ ఇలానే కొనసాగితే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనబడడంలేదు.
ఎన్డీఏ కూటమి సునామీ..(YCP Opposition Status)
ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే వైసీపీ కేవలం 12 స్దానాల్లోనే ఆధిక్యంలో ఉంది. దీనితో వైసీపీకి ప్రతిక్ష స్దానం దక్కుతుందా అన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అంచనాలకు మించి దూసుకువెడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే సునామీ సృష్టించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనపరిచింది. టీడీపీ పార్టీ ఆవిర్బావం తరువాత అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ 1994లో సాధించిన విజయం కన్నా అతిపెద్ద విజయం సాధించింది.