Site icon Prime9

Ravuri Sheela: డాక్టరేట్ పట్టా పొందిన ఆటో డ్రైవర్ భార్య రావూరి షీలా

Ravuri Sheela

Ravuri Sheela

 Ravuri Sheela: గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో ఆటో డ్రైవర్ భార్య రావూరి షీలా డాక్టరేట్ పట్టా పొందారు. ఎంతో పట్టుదలతో సాగిన ఆమె ప్రయాణం ఆమె పలువురికి స్పూర్తిదాయకం. ఆమె పట్టుదలకు భర్త సహకారంతోడయి డాక్టరేట్ పట్టా తీసుకునేలా చేసింది.

పెదరావూరుకు చెందిన రావూరి షిలా చిన్నతనంలోనే తల్లి చనిపోయింది.అప్పటినుంచీ అమ్మమ్మ తాతయ్యల పెంపకంలో డిగ్రీ తొలి సంవత్సరం వరకూ చదువు కొనసాగించింది. అనంతరం గ్రామంలోని వరుసకు మేనమామ అయిన ఆటో డ్రైవర్ రావూరి కరుణాకర్ తో వివాహం జరిగింది. జీవితంలో మంచి చదువు చదివి గొప్ప స్థాయిలో ఉండాలన్న ఆకాంక్ష షీలా మనుసులో బలంగా ఏర్పడింది. భర్త కరుణాకర్ తనకు చదువుకోవాలని ఉందని చెప్పడంతో ఆయన ప్రోత్సహించారు. రెండవసంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకుని 2008లో మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయానికి ఆటో డ్రైవర్ గా ఉన్న కరుణాకర్ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంచటంతో చదువుకు బ్రెక్ పడింది. ఆ సమయంలోనే ఉచిత కంప్యూటర్ శిక్షణలో పీజీడీసీఎ పూర్తి చేసింది. ఉద్యోగం కావాలంటే తప్పని సరి డిగ్రీ అని 2008లో తిరిగి బీకాం పూర్తి చేసింది. తెనాలి ఎన్ఆర్ అండ్ కెఎస్ఆర్ గుప్తా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో మాస్టర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేసుకుని జేఎంజే కాలేజ్ తెనాలిలో 2012లో ఎయిడెడ్ లెక్చరర్ పోస్ట్ కి అప్లైచేయడంతో పీహెచ్ చదివిఉండాలని తెలపడంతో పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకుంది.

షీలా 2014లో పీహెచ్‌డీకి అప్లై చేసింది. నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ ఎన్.రత్నకిషోర్ దగ్గర ఫుల్ టైం రిసెర్చ్ స్కాలర్‌గా షీలా జాయిన్ అయింది. రోజూ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీలో చదువుకుంటూ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవంలో పట్టా పొందడానికి అర్హత సాధించింది. నేడు జరిగిన వార్షికోత్సవంలో ఆమె పట్టా తీసుకుంది. షీలా కృషిని, పట్టుదలను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar