Janasena chief Pawan Kalyan: మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకు? .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఒకడి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం మనకి లేదు .మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని పవన్ ప్రసంగించారు .మేము అధికారంలోకి కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు లు ఇస్తామని చెప్పారు .

  • Written By:
  • Updated On - May 1, 2024 / 01:43 PM IST

Janasena chief Pawan Kalyan:ఒకడి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం మనకి లేదు .మన భూమి మీద జగన్ బొమ్మ ఎందుకంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేట లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని పవన్ ప్రసంగించారు .మేము అధికారంలోకి కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు లు ఇస్తామని చెప్పారు .

జగన్ వస్తే రాష్ట్రం అతలాకుతలం..(Janasena chief Pawan Kalyan)

దేశానికీ యువ రక్తం కావాలని యువత కోసం కూటమి పనిచేస్తుందని ఈ సందర్భంగా జనసేనాని చెప్పారు .జనసేన కుటుంబాలను కలుపుతుంటే ..జగన్ మాత్రం కుటుంబాలను విడదీశారని పవన్ కళ్యాణ్ అన్నారు .సొంత చెల్లెళ్లను సైతం జగన్ దూరం పెట్టారని పవన్ దుయ్యపట్టారు .కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పనులు చేయక పోతే నా దృష్టికి తీసుకురండి నేను భాద్యత తీసుకుంటానని పవన్ అన్నారు .జగన్ ఇసుక ,కొండలను కూడా దోచేసాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మరో సారి జగన్ వస్తే రాష్ట్రం అతలాకుతలం అవుతుందని అన్నారు .నాకు అన్నిటి కన్నా ప్రజా క్షేమమే ముఖ్యమని అన్నారు .నేను ఏ ఒక్క కులానికి చెందిన వాడిని కాదని మహా కవి జాషువా మాదిరి నేను విశ్వ నరుడునని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .కోన సీమ అల్లర్లవిషయంలో అమాయకులపై కేసు లు పెట్టారని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు .ఎన్నికల క్రమంలో కేసులు ఈ మద్యే ఎత్తివేసారని పవన్ తెలిపారు .ఆ కేసు లో వున్న ఏ 1 ముద్దాయి ఇప్పుడు విశ్వరూప్ తో తిరుగుతున్నాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .తోట త్రిమూర్తులు ,పిల్లి సుభాష్ చంద్ర బోస్ లు ఇద్దరు కూడా దీని పై స్పందించలేదని అన్నారు .కూటమి గెలిస్తేనే అభివృద్ధి ,సంక్షేమం రెండు జరుగుతాయని పవన్ అన్నారు .