Marrirajasekhar Reddy : ఐటీ అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి

తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు.

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 12:59 PM IST

Marrirajasekhar Reddy: తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి చెప్పారు. విహారయాత్రకు టర్కీ వెళ్లిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయాన్నే హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి నేరుగా తన నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి, తల్లి, కూతురితోపాటు ఇతరుల ఫోన్లను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారన్నారు. ఐటీ అధికారుల తీరుతో తన కూతురు ఇబ్బందిపడిందని తెలిపారు.

తనకు ఐటీ అధికారులు ఫోన్లు చేయలేదని రాజశేఖర్ రెడ్డి చెప్పారు.  మీడియా ద్వారానే తనకు ఐటీ దాడుల విషయం తెలిసిందని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. . తన నివాసంలో రూ. 4 కోట్లు సీజ్ చేశారన్నారు. కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం కోటి రూపాయాలకుపైగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఐటీ సోదాలకు తాము సహకరిస్తామన్నారు. తాముమ చట్టప్రకారంగా ట్యాక్సులు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు..మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహించారు.