Site icon Prime9

Revanth Reddy comments: సీతక్కను సీఎంగా చేస్తాము.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy comments: అమెరికా ఎన్నారైలు ఏర్పాటు చేసిన తానా సభలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం, అమరావతిని కట్టేది కాంగ్రెస్ పార్టీనే అని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేస్తామని, కాంగ్రెస్ పార్టీని పవర్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నిత్యం శ్రమిస్తూనే ఉంటాడని హామీ ఇచ్చారు.

ఎన్నారైలు సహకరించాలి..(Revanth Reddy comments)

అమెరికాలో జరిగిన తానా సభల్లో దళితులు, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని ఎన్నారైలు రేవంత్‌ను కోరగా, కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని, అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని సమాధానమిచ్చారు.త్వరలోమ తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి తమ సహాయ సహకారాలు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు.

Exit mobile version