Site icon Prime9

రుషికొండ : విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాలు.. రాష్ట్రం, కేంద్రం చేతులు కలిపేసినట్లు ఉందన్న హైకోర్టు

High Court

High Court

Rushikonda : విశాఖ రుషికొండ అక్రమ తవ్వకాల విషయంలో రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్లుగా ఉందని ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు‌లో బుధవారం విచారణ జరిగింది. అక్రమ తవ్వకాలపై నిగ్గు తేల్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం వేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించించడం పై పిటిషనర్ల తరపు న్యాయవాదులు గత విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నియామకాలు కోర్టు ఆదేశాలకు విరుద్దంగా ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని గతంలోనే హైకోర్టు ఆదేశించింది.

ఈ అంశంపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంతో కేంద్రం చేతులు కలిపినట్టుగా కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ జరిపి తామే కమిటీని నియమిస్తామని హైకోర్టు పేర్కొంది.

విశాఖలో సముద్రం ఒడ్డున ఉండే రుషికొండలో టూరిజం రిసార్ట్స్ కూల్చి వేసారు. పర్యావరణ నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘించి రుషికొండలో తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

Exit mobile version